logo

గంజాయి నియంత్రణ బాధ్యత అధికారులదే: ఎస్పీ

జిల్లాలో గంజాయి నియంత్రణ బాధ్యత అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్‌ అధికారులదే.. విధులు విస్మరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు.

Published : 01 Apr 2023 03:13 IST

సెబ్‌, పోలీసు అధికారులతో సమీక్షిస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

తిరుపతి(నేరవిభాగం): జిల్లాలో గంజాయి నియంత్రణ బాధ్యత అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్‌ అధికారులదే.. విధులు విస్మరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం డీపీవోలో సెబ్‌, పోలీసు అధికారులతో గంజాయిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ డివిజన్‌ పరిధిలో ఎంత మేరకు గంజాయి వినియోగం.. అక్రమ రవాణా సాగుతుంది.. ఎవరి ప్రమేయం ఎంత వరకు ఉందనే విషయాలను వెల్లడిస్తూ అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి తాగినా.. విక్రయించినా.. అక్రమ రవాణా చేసినా.. అందుకు సహకరించినా చర్యలు తప్పవని తెలిపారు. కేసులు నమోదు చేయడంతోపాటు జిల్లా బహిష్కరణ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల అధికారులు రోజూ సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ప్రధాన కూడళ్లలో వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్‌, మునిరామయ్య, రాజేంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ స్వాతి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని