logo

ఆంధ్రుల ఆత్మ గౌరవం మన జాతీయ జెండా

జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని ప్రధానోపాధ్యాయిని రియాజున్నీసా తెలిపారు. శుక్రవారం పూజగానిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జెండా వందనం చేసి ర్యాలీ నిర్వహించారు.

Published : 01 Apr 2023 03:09 IST

జాతీయ జెండాకు వందనం చేస్తున్న విద్యార్థులు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని ప్రధానోపాధ్యాయిని రియాజున్నీసా తెలిపారు. శుక్రవారం పూజగానిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జెండా వందనం చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1921 ఏడాది విజయవాడలో జరిగిన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను గాంధీజీ ఆమోదించారన్నారు. 1947 జులై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జెండాలో రాట్నం బదులుగా అశోక చక్రం ఉండేలా తీర్మానించారని, జెండా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు పురుషోత్తమరాజు, సుమతి, ప్రమీల, ఉమా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని