logo

‘పింఛన్‌ ఇవ్వకపోతే మిద్దెపై నుంచి దూకేస్తా’

ఎంతో కాలంగా వస్తున్న పింఛన్‌ను తొలగించడం వల్ల ఇబ్బందిగా ఉందని వృద్ధుడు పరదేశీ వాపోయారు. శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం అనంతరం పుర అధ్యక్షురాలు నక్కా భానుప్రియ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు.

Published : 01 Apr 2023 03:09 IST

కౌన్సిల్‌ హాల్‌లో పుర అధ్యక్షురాలికి సమస్య వివరిస్తున్న పరదేశీ

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఎంతో కాలంగా వస్తున్న పింఛన్‌ను తొలగించడం వల్ల ఇబ్బందిగా ఉందని వృద్ధుడు పరదేశీ వాపోయారు. శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం అనంతరం పుర అధ్యక్షురాలు నక్కా భానుప్రియ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. కేవలం విద్యుత్తు బిల్లు ఎక్కువ వచ్చిందనే నెపంతో రెండు నెలలు కిందట తొలగించారన్నారు. అసలే ఆరోగ్యపరిస్థితి సరి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలా చేయడం న్యాయమా అని ప్రశ్నంచారు. తనకు తక్షణమే పింఛన్‌ మంజూరు చేయకపోతే మీ కళ్ల ముందే మిద్దెపై నుంచి దూకేస్తానంటూ వృద్దుడు వాపోయాడు. ఈ క్రమంలో స్పందించిన పుర అధ్యక్షురాలు భానుప్రియ పింఛను మంజూరు చేశామని ఆవేశపడవద్దని సూచించారు. ఈక్రమంలో వృద్ధుడు ఎప్పుడో ఇవ్వడం కాదని రేపే తనకు పింఛన్‌ నగదు అందించాలని డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో కౌన్సిలర్లు ఇతనికి సర్థిచెప్పి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని