logo

పాత బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగించాలి

పాత బస్టాండ్‌ పరిధిలో వ్యాపారులు యథావిధిగా రోడ్డుపైకి రావడంవల్ల పాదచారులు నానా అగచాట్లు పడుతున్నారని రైతు కూలీ సంఘం నేత రమణయ్య శుక్రవారం పుర కమిషనర్‌ వెంకటరామయ్యకు తెలిపారు.

Published : 01 Apr 2023 03:09 IST

పుర కమిషనర్‌కు సమస్యను వివరిస్తున్న రైతు కూలీ సంఘం నేత

వెంకటగిరి, న్యూస్‌టుడే: పాత బస్టాండ్‌ పరిధిలో వ్యాపారులు యథావిధిగా రోడ్డుపైకి రావడంవల్ల పాదచారులు నానా అగచాట్లు పడుతున్నారని రైతు కూలీ సంఘం నేత రమణయ్య శుక్రవారం పుర కమిషనర్‌ వెంకటరామయ్యకు తెలిపారు. గతంలో వ్యాపారులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. రోడ్డు మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేయడంవల్ల ఇరు వైపులా వాహనాలు వెళ్లుతున్నాయన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న ఇనుప డివైడర్‌ను తొలగించడంతో వ్యాపారులు యథావిధిగా రోడ్డుపైకి చొచ్చుకు వస్తున్నారన్నారు. బస్టాండ్‌ ప్రాంతంలో నిత్యం బస్సులు రద్దీగా ఉంటుందని ఇక్కడ ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని