logo

‘నిధులు లేకుండా పనులు ఎలా పెడతారు’

నిధులు లేకుండా కౌన్సిల్‌ సమావేశంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అజెండాలో ఎలా పెడతారంటూ కౌన్సిలర్లు ఢిల్లీబాబు, శంకరయ్య, రాధమ్మ ప్రశ్నించారు.

Published : 01 Apr 2023 03:09 IST

కౌన్సిలర్‌తో కౌన్సిలర్‌ ఢిల్లీబాబు వాగ్వాదం

వెంకటగిరి, న్యూస్‌టుడే: నిధులు లేకుండా కౌన్సిల్‌ సమావేశంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అజెండాలో ఎలా పెడతారంటూ కౌన్సిలర్లు ఢిల్లీబాబు, శంకరయ్య, రాధమ్మ ప్రశ్నించారు. పుర కార్యాలయంలో శుక్రవారం అధ్యక్షురాలు నక్కా భానుప్రియ ఆధ్వర్యంలో కౌన్సిల్‌, బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీబాబు మాట్లాడుతూ తన వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.16.50 లక్షలు మేర పనులు చేసినట్లు రికార్డులు పరంగా పెట్టారని పనులు చేయకుండానే ఇలా చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మరో కౌన్సిలర్‌ జానకీరామయ్య అడ్డు కోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బొగ్గులమిట్టలో వీధిదీపాలు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు ఇచ్చిన ఆరు నెలలు కావస్తున్నా నేటికీ పట్టించుకోలేదని వార్డులో ఏ మోహం పెట్టుకుని తిరగాలని కౌన్సిలర్‌ శంకరయ్య అధికారులను నిలదీశారు. వెంకటగిరి అభివృధ్దికి ఎన్నలేని కృషి చేసిన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. టిడ్కో ఇళ్లకు గతంలో లబ్ధిదారులు నగదు చెల్లించినా నేటికీ అప్పగించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్‌ గోపాలకృష్ణ అన్నారు.

బడ్జెట సమావేశంలో కౌన్సిలర్లు డుమ్మా

మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కీలకమైన బడ్జెట్‌ సమావేశం మధ్యాహ్నం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో 25 మంది కౌన్సిలర్లు ఉంటే వీరిలో కేవలం పుర అధ్యక్షురాలితో సహా 12 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బడ్జెటలో ప్రారంభ నిల్వగా రూ.2,87,17,795లు. జమలు రూ.85,52,43,810 కోట్లు, మూలధన ఖర్చులు రూ.60,81,00,265 కోట్లు, ముగింపు నిల్వగా రూ.27,58,61,340 కోట్లుతో బడ్జెట్‌ అంచనాలు రూపొందించగా కౌన్సిలర్లు ఆమోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని