logo

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

పొదుపు గ్రూపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సంకల్పంతో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ ఆసరా పథకాన్ని కొనసాగిస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.

Updated : 01 Apr 2023 03:33 IST

తడలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు

తడ, న్యూస్‌టుడే: పొదుపు గ్రూపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సంకల్పంతో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ ఆసరా పథకాన్ని కొనసాగిస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన మూడో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంపీపీ కె.రఘురెడ్డి, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ గండవరం సురేష్‌రెడ్డి, నాయకులు మునీష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు కె.వెంకటేష్‌, రమేష్‌, నాయకులు కె.ఆర్ముగం, టి.కోదండం, శశికుమార్‌, మహేశ్వర్‌, పరమశివారెడ్డి, హుస్సేన్‌బాయ్‌ తదితరులు పాల్గొన్నారు.     

వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి

గూడూరుగ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంకు అండగా నిలవాలని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదురావు తెలిపారు. గూడూరు పట్టణం షాదిమంజిల్‌లో శుక్రవారం వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మూడో విడత చెక్కులను వైకాపా నాయకులతో కలిసి పొదుపు మహిళలకు పంపిణీ చేశారు. వైకాపా సీనియర్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, విజయకుమార్‌, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో గూడూరు మండల వెలుగు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం చెక్కులను పొదుపు మహిళలకు ఎమ్మెల్యే వరప్రసాదురావు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని