logo

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని మూగనపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు రైతు రమేష్‌రెడ్డి(35)కి మూడెకరాల పొలం ఉంది.

Published : 01 Apr 2023 03:09 IST

రమేష్‌రెడ్డి (పాతచిత్రం)

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని మూగనపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు రైతు రమేష్‌రెడ్డి(35)కి మూడెకరాల పొలం ఉంది. పంటల సాగుతో పాటు పశుగ్రాసం పెంచుకుని పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. ఎకరాలో టమోటా, ఎకరంలో పశుగ్రాసం సాగు చేశాడు. పెట్టుబడి కూడా చేతికి దక్కకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. రూ.1.5 లక్షలు పంట రుణం, రూ.4 లక్షలు మార్ట్‌గేజ్‌ రుణం తీసుకున్నాడు. వ్యవసాయం కలిసి రాకపోగా.. ఏడాదిన్నర కుమార్తె నైనికకు క్యాన్సర్‌ సోకింది. ఒక్కగానొక్క కుమార్తె ఆరోగ్యం బాగు కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నాడు. చిన్నారి వైద్యం కోసం దాదాపు రూ.12 లక్షలు పైగా ఖర్చు చేశాడు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఇటీవల బ్యాంకులో ఇంటిపై రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. ఓ వైపు కూతురు అనారోగ్య సమస్య.. మరో వైపు రుణాలకు వడ్డీలు కట్టడానికి పొలంలో ఆదాయం చేతికి అందక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆ బాధతో తీవ్ర రమేష్‌రెడ్డి శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై నరసింహులు, సిబ్బంది సంఘటనా స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని