logo

బాలికను రెండో పెళ్లి చేసుకున్న అధ్యాపకుడు

బాలికను ఓ అధ్యాపకుడు రెండో పెళ్లి చేసుకున్న ఉదంతమిది. మండలంలోని గుండుగల్లు పంచాయతీ బొమ్మనపల్లెకు చెందిన చలపతి (33) గంగవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

Published : 01 Apr 2023 03:09 IST

గంగవరం, న్యూస్‌టుడే: బాలికను ఓ అధ్యాపకుడు రెండో పెళ్లి చేసుకున్న ఉదంతమిది. మండలంలోని గుండుగల్లు పంచాయతీ బొమ్మనపల్లెకు చెందిన చలపతి (33) గంగవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు సంతానం. ప్రస్తుతం భార్య గర్భిణి. ఇదే కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక(17)కు మాయమాటలు చెప్పి బుధవారం పరీక్షలు ముగిశాక బెంగళూరుకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చలపతిని శుక్రవారం అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని