logo

తిరుపతిలో ‘ఐపీఎల్‌’ ఫ్యాన్‌ పార్కు

క్రికెట్‌ ప్రేమికులకు ఆహ్లాదం, వినోద కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే మ్యాచ్‌ స్క్రీనింగ్‌ ఈవెంట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్యాన్‌ పార్క్‌ తిరుపతికి రానుంది.

Published : 01 Apr 2023 03:09 IST

తిరుపతి(క్రీడలు): క్రికెట్‌ ప్రేమికులకు ఆహ్లాదం, వినోద కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే మ్యాచ్‌ స్క్రీనింగ్‌ ఈవెంట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్యాన్‌ పార్క్‌ తిరుపతికి రానుంది. బీసీసీఐ.. మెగా టాటా ఐపీఎల్‌- 2023ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసింది. కొవిడ్‌- 19 వ్యాప్తి కారణంగా మూడేళ్ల విరామం తర్వాత బీసీసీఐ ఐపీఎల్‌ ఫ్యాన్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది.  దేశంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్‌ అభిమానుల కోసం ప్రతి వారాంతంలో టోర్నమెంట్‌ వ్యవధిలో ఐదు ఫ్యాన్‌ పార్కులు ఉండనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొదటిదిగా తిరుపతి, రెండోది గుంటూరును ఎంపిక జాబితాలో చేర్చారు. తిరుపతిలో ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఫ్యాన్‌ పార్కు నిర్వహణ ఉండనుంది

పరిశీలనకు బీసీసీఐ ప్రతినిధులు: తిరుపతిలో వేదిక పరిశీలనకు బీసీసీఐ ప్రతినిధులు రానున్నారు. ఎస్పీజేఎన్‌ఎం పాఠశాల క్రీడా మైదానం వేదికగా 2017లో ఈవెంట్‌ క్రికెట్‌ జరిగింది. కరోనా విరామం తర్వాత ఈ ఏడాది తిరిగి తిరుపతి వేదికగా రానుంది. ఇందుకు ఎస్వీయూ, తుమ్మలగుంట స్టేడియాలు పరిశీలనలో ఉన్నాయి. నిర్వహణ చిత్తూరు జిల్లా బాలబాలికల క్రికెట్‌ అసోసియేషన్‌కు దక్కనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని