మండుటెండలో విజయ వసంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు 2023 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్నీ మంచి శకునాలే జరిగాయి.
ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో ఇస్రో అధిపతి సోమనాథ్ కరచాలనం
సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు 2023 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్నీ మంచి శకునాలే జరిగాయి. ఈ ఏడాది మొదటి నుంచి ఐదు నెలల్లో పంపిన రాకెట్ ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. ఫిబ్రవరి నుంచి నాలుగు నెలల్లో నాలుగు వేర్వేరు రాకెట్ ప్రయోగాలు చేపట్టారు. వాణిజ్యపరంగాను భారీగా రాబడి సాధించారు. ఫిబ్రవరిలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2, మార్చిలో ఎల్‌వీఎం మిషన్‌తో వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు, ఏప్రిల్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ55 వాహకనౌకతో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలు పంపారు. మార్చి, ఏప్రిల్‌లో పంపిన రాకెట్‌తో వాణిజ్యపరంగా లబ్ధి చేకూరింది. తాజాగా సోమవారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం చేశారు.
శాస్త్రవేత్తల్లో ఆనందం.. స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో చేపట్టిన ఆరో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం కావడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రయో గ వేదిక నుంచి బయలుదేరిన తర్వాత 18 నిమిషాల వరకు ఇస్రో అధిపతితోపాటు ఇతరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 19 నిమిషంలో ఎన్‌వీఎస్-01 సపరేషన్ అయినట్లు సమాచారం అందడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్‌దార్‌కర్, ఇస్రో మాజీ అధిపతులు రాధాకృష్ణన్, ఎఎస్ కిరణ్‌కుమార్‌తో పాటు మరికొందరు ప్రముఖులు పలువురు ప్రముఖులు వీక్షించారు. మండుటెండలను లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గొడుగులు చేతపట్టుకుని నింగిలోకి వెళ్లే రాకెట్‌ను వీక్షించారు.
నిప్పులు చిమ్ముతున్న జీఎస్‌ఎల్‌వీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Dhinidhi Desinghu: వయసు 13.. పతకాల వేటలో ముందంజ..
-
Zepto: లింక్డిన్ ర్యాంకింగ్స్.. టాప్ ఇండియన్ స్టార్టప్‌గా జెప్టో
-
Canada: పన్నూపై నిషేధం విధించండి.. కెనడా హిందూ గ్రూపుల విజ్ఞప్తి
-
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ చూడలేదు.. ఎందుకంటే: సీనియర్ నటుడు వ్యాఖ్యలు
-
Chandrababu: చంద్రబాబు ఎస్ఎల్పీపై సుప్రీంలో విచారణ
-
Mahesh babu: రాజమౌళితో కంటే ముందు ఆ దర్శకుడితో మహేశ్ సినిమా!