స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు
చిత్తూరు అర్బన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం మినహా రోజూ 50కిపైనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సోమవారం సర్వర్ సమస్య తలెత్తడంతో సేవలన్నీ స్తంభించాయి.
సర్వర్ సమస్యతో ఇక్కట్లు
కుప్పంలో వేచి ఉన్న ప్రజలు
చిత్తూరు అర్బన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం మినహా రోజూ 50కిపైనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సోమవారం సర్వర్ సమస్య తలెత్తడంతో సేవలన్నీ స్తంభించాయి. స్టాంపు పత్రాల విక్రయాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ), నకళ్లు, మార్కెట్ వాల్యూ ధ్రువపత్రం జారీ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈకేవైసీ, ఫొటోలు తీసుకోవడం, వేలిముద్రలు సేకరించే పనులు జరగలేదు.
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ 15 నుంచి 40 దస్తావేజులు జరుగుతుంటాయి. సోమవారం సర్వర్ సమస్యతో ఒక్క దస్తావేజూ రిజిస్ట్రేషన్ జరగలేదు. చిత్తూరు రూరల్, బంగారుపాళ్యం, కార్వేటినగరం, నగరి, పుంగనూరు కార్యాలయాల వద్దా.. దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.
చిత్తూరు(సంతపేట), కుప్పం(పట్టణం), న్యూస్‌టుడే: సవరించిన భూ విలువలు త్వరలో అమలవుతాయనే ప్రచారం నేపథ్యంలో అదనపు మోతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సోమవారం అధిక సంఖ్యలో క్రయవిక్రయదారులు వచ్చారు. సర్వర్ సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఆశతో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. రిజిస్ట్రేషన్ సేవలు ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా జరుగుతుంటాయి. ఉదయం నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో ఒక్క పనీ జరగలేదు. స్టాంపు పత్రాల జారీ, ఈసీ, నకలు పత్రాల జారీ వంటి పనులు నిలిచాయి. కొన్ని చోట్ల ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాసేపు సర్వర్ పనిచేసిందని, మిగతా సమయంలో పనిచేయలేదని తెలుస్తోంది. కొంతమంది క్రయవిక్రయదారులు మంగళవారం సెంటిమెంట్‌తో రిజిస్ట్రేషన్లకు వెళ్లరు. సోమవారమైనా రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే బాగుండేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య తలెత్తిందని స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!