logo

రూ.14,340 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక

2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.14,340 కోట్లు అని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు.

Published : 30 May 2023 02:30 IST

వార్షిక రుణ ప్రణాళిక బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న   కలెక్టర్‌ షన్మోహన్‌, బ్యాంకు అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌, నగరం, న్యూస్‌టుడే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.14,340 కోట్లు అని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. చిత్తూరులోని ఇండియన్‌ బ్యాంక్‌ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో సోమవారం వార్షిక రుణ ప్రణాళిక బుక్‌లెట్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళికలో 83 శాతంతో వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలకు రూ.9,813 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ రంగాలకు రూ.1,674 కోట్లు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు రూ.1,523 కోట్లు కేటాయించామన్నారు. అప్రాధాన్యతా రంగాలకు రూ.2,169 కోట్లు కేటాయించారన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శేషగిరిరావు, ఇండియన్‌ బ్యాంక్‌ జెడ్‌ఎం సెల్వరాజ్‌, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ ఛైర్మన్‌ ఏఎస్‌ఎన్‌ ప్రసాద్‌, నాబార్డు డీడీఎం సునీల్‌, ఎస్‌బీఐ ఆర్‌ఎం శ్రీవాణి కిషోర్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ సీఈవో మనోహర్‌గౌడ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు