logo

రూ.30లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగల స్వాధీనం

ఎర్రచందనం దుంగలను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశామని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Published : 30 May 2023 02:30 IST

దొంగలను అరెస్టు చూపుతున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

బంగారుపాళ్యం: ఎర్రచందనం దుంగలను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశామని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. కేసు వివరాలను విలేకరులకు సోమవారం తెలిపారు. ‘మహాసముద్రం టోల్‌ప్లాజా వద్ద బంగారుపాళ్యం సీఐ నరసింహారెడ్డి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న రెండు కార్లను సోదా చేయగా రూ.30లక్షల విలువ చేసే 16 ఏ గ్రేడ్‌ ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కార్లలో ఉన్నవారిలో ఆరుగురు పరారు కాగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించాం. శేషాచలం అడవుల నుంచి బెంగళూరు తరలిస్తున్నట్లు తేలింది. కర్ణాటక రాష్ట్రం కటిగినహళ్లికి చెందిన ఇమ్రాన్‌ షరీఫ్‌ నేతృత్వంలో దుంగలు తరలిస్తున్నారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని బేతమంగళంకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌, తిరువణ్ణామలై జిల్లా కుటతూర్‌కు చెందిన మహేంద్ర, తిరుపత్తూరు జిల్లా తగరకుప్పానికి చెందిన కాళియప్పన్‌, శివశంకర్‌, రవి, మహదేవన్‌, మిట్టూరు గ్రామానికి చెందిన శివన్‌, చిన్నతంబిని అరెస్టు చేశాం. కర్ణాటకకు చెందిన ఇమ్రాన్‌ షరీష్‌, తమిళనాడుకు చెందిన వెంకటేష్‌, సుందరమూర్తి, వాసిం, వెడి, దొరై పరారయ్యార’ని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని