కుచివాడ ఇసుక రీచ్ రద్దు చేయాలి
రైతుల ప్రయోజనాలు దెబ్బతిసేలా నాయుడుపేట మండలం స్వర్ణముఖిలో కుచివాడ వద్ద అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్‌ను ప్రభుత్వం రద్దు చేయాలంటూ మంగళవారం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని 8 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు.
8 గ్రామాల రైతుల రాస్తారోకో
రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
నాయుడుపేట: రైతుల ప్రయోజనాలు దెబ్బతిసేలా నాయుడుపేట మండలం స్వర్ణముఖిలో కుచివాడ వద్ద అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్‌ను ప్రభుత్వం రద్దు చేయాలంటూ మంగళవారం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని 8 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. ఈ ప్రాంతంలో 70 ఎకరాల్లో నదీ తీరాన ఇసుక తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు ఇవ్వడం తెలిసిందే. తవ్వకాలతో వ్యవసాయ, తాగునీటి పంపుసెట్లు ధ్వంసం చేస్తారని, భూగర్భ జలమట్టాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడుతుందని సమీప గ్రామాలు ఇక్కడ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా కుచివాడ, కుచివాడపాళెం, మడఫలం, కాలువగట్టు, వేమగుంటపాళెం, అన్నమేడు, చిలమత్తూరు, చిట్టమూరు మండలంలో గునపాటిపాళెం గ్రామాల రైతులు వందల సంఖ్యలో కాలువగట్టు గ్రామానికి సమీపంలో రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఉదయం 9-12 గంటల వరకు వాహనాల రాకపోకలు స్తంభింపజేశారు. దీంతో ఇసుక వాహనాలు ఇరువైపులా భారీగా బారులుతీరాయి. అనంతరం నాయుడుపేట తహసీల్దారు రాజేంద్రం, అర్బన్ సీఐ నరసింహారావు, ఎస్సై శ్రీకాంత్ రైతులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. రైతులకు మద్దతుగా తెదేపా, వైకాపా, భాజపా నాయకులు కామిరెడ్డి అశోక్‌కుమార్‌రెడ్డి, దువ్యూరు శ్రీనివాసులురెడ్డి, సుధాకర్‌రెడ్డి, ధనంజయరెడ్డి, శ్రీధర్‌రెడ్డి మధుసూధన్‌రెడ్డి సర్పంచి రమణయ్య, మాజీ ఎంపీటీసీ బల్లి ఏసుదాసు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!