logo

రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సిందే

రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన మామిడి కాయలనే కోసి మార్కెట్‌కు తరలించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.  

Published : 31 May 2023 03:57 IST

యార్డులో మామిడికాయలు పరిశీలిస్తున్న  జిల్లా ఉద్యానశాఖాధికారి దశరథరామిరెడ్డి తదితరులు

పుత్తూరు, న్యూస్‌టుడే: రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన మామిడి కాయలనే కోసి మార్కెట్‌కు తరలించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.  పుత్తూరు, తిరుచానూరు, దామలచెరువు మార్కెట్‌యార్డులో మామిడి రైతుల కష్టాలపై ‘ఈనాడు’లో ‘తీపి కబురు చెప్పేదెన్నడో’ శీర్షికన ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. దీనిలో భాగంగా.. స్థానిక మార్కెట్‌యార్డును సందర్శించి వ్యాపారులతో సమీక్షించారు. రైతులకు తప్పక గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనని, వారు తెచ్చిన కాయల్లో సూట్‌ తీయడమేంటని ప్రశ్నించారు. కమీషన్‌ వసూలు చేస్తే మండీలు మూసివేయిస్తానని హెచ్చరించారు. అనంతరం లియాన్‌ పల్ప్‌ ఫ్యాక్టరీ, నారాయణవనంలో టాసా ఫ్యాక్టరీని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. మామిడి కాయల్లో. తీపి(బ్రిక్స్‌) శాతం తక్కువగా ఉండటంతో ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారన్నారు. నూజివీడు,  కృష్ణగిరి నుంచి కాయలు వస్తున్నాయని, అక్కడా పంట తుదిదశకు చేరిందన్నారు. జూన్‌ రెండో వారానికి తిరుపతి, చిత్తూరు జిల్లాలోని కాయలు పక్వానికి వస్తాయని, అప్పటివరకు రైతులు వేచిఉండాలన్నారు. మార్కెట్‌యార్డు కార్యదర్శి లక్ష్మీప్రసాద్‌, ఉద్యాన అధికారి వెంకట సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు