logo

అన్నదాతల అభ్యున్నతే ధ్యేయం

అన్నదాతల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం యంత్ర సేవా పథకం కింద జిల్లాలోని లబ్ధిదారులకు 111 ట్రాక్టర్లను ఆయన పôపిణీ చేశారు.

Updated : 03 Jun 2023 04:24 IST

యంత్రసేవా పథకంలో 111 ట్రాక్టర్ల పంపిణీ

లబ్ధిదారులకు ట్రాక్టర్‌ మెగా కీ అందజేస్తున్న మంత్రి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే శ్రీనివాసులు, కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు(వ్యవసాయం): అన్నదాతల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం యంత్ర సేవా పథకం కింద జిల్లాలోని లబ్ధిదారులకు 111 ట్రాక్టర్లను ఆయన పంపిణీ చేశారు.  జిల్లాలో 237 సంఘాలకు 111 ట్రాక్టర్లు అందజేశామని, రాయితీ రూ.2.90 కోట్లు, ఇతర పరికరాల రాయితీ రూ.1.27కోట్లు మంజూరు చేశామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, కుప్పం బ్రాంచి కెనాల్‌ త్వరలో పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు.పశ్చిమ ప్రాంతంలో మూడు జలాశయాలు నిర్మిస్తుంటే కోర్టుల ద్వారా పనులు అడ్డుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అనంతరం మంత్రి ట్రాక్టర్ల పంపిణీని జెండా ఊపి ప్రారంభించి లబ్ధిదారులకు మెగా తాళం, రాయితీ నగదు చెక్కు అందజేశారు. ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ షన్మోహన్‌, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ అముద, డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, ఆర్టీసీ వైస్‌ఛైర్మన్‌ విజయానంద రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, డీఆర్వో రాజశేఖర్‌, జేడీఏ మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి మధుసూదనరెడ్డి, ఆర్డీవో రేణుక, మొదలియార్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సురేష్‌, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ ధనంజయరెడ్డి, ఐసీడీఎస్‌ రాయలసీమ జోనల్‌ ఛైర్‌పర్సన్‌ శైలజారెడ్డి పాల్గొన్నారు.

* జిల్లా కేంద్రంలో గురు, శుక్రవారాల్లో జరిగిన రైతుల కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని