logo

జగనన్నా.. నీళ్లేవి?

జగనన్న లేఔట్‌లో నిర్మాణాలకు అవసరమైన నీటికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు.  వెంకటగిరి పరిధిలో 2,250 గృహాలు మంజూరు చేశా రు. రూ.90 లక్షలతో పది బోర్లు, మోటార్లు, 90 మినీ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు.

Published : 03 Jun 2023 02:11 IST

సొంత ఏర్పాట్లలో లేఔట్ల లబ్ధిదారులు
అదనపు భారంపై ఆవేదన

వెంకటగిరి పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు

వెంకటగిరి: జగనన్న లేఔట్‌లో నిర్మాణాలకు అవసరమైన నీటికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు.  వెంకటగిరి పరిధిలో 2,250 గృహాలు మంజూరు చేశా రు. రూ.90 లక్షలతో పది బోర్లు, మోటార్లు, 90 మినీ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. నాసిరకం పనులతో పలు చోట్ల పైపులు పగిలి నీరంతా వృథాగా పోతోంది. పలు ట్యాంకులకు సరఫరా జరగడం లేదు. లోతట్టు ప్రాంతానికి నీరందుతుండగా ఎగువన ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. మరమ్మతులకు ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే. కొన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకులు లేక ప్రైవేటుగా ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్యాంకర్‌కు   రూ.1000 వరకు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కొందరు నెలకు అద్దె చెల్లించి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. సొంతంగా బోర్లు వేసుకోవాలంటే రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. మరికొందరు సమీపంలో బోరున్నవారికి కొంత నగదు చెల్లించి నీటిని వాడుకుంటున్నారు.

దొంగల బెడదతో..

ఇళ్లు వేగంగా నిర్మించుకోమని చెబుతున్న అధికారులు అవసరమైన నీటి వసతి మాత్రం కల్పించడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోరు.. సొంతంగా బోర్లు వేయించుకుందామంటే దొంగల బెడద తీవ్రంగా ఉంది. మోటార్లు, తీగలు చోరీ చేస్తున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది.

రత్నం, లబ్ధిదారుడు, వెంకటగిరి

సమస్యలు పరిష్కరిస్తాం

నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పైపులైన్ల మరమ్మతుల కోసం ఇటీవలే కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించాం. త్వరలోనే లబ్ధిదారులకు అవసరమైన నీటిని సరఫరా చేస్తాం.

వెంకటరామయ్య, పుర కమిషనర్‌, వెంకటగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని