logo

‘వైకాపాను గద్దె దింపడమే ధ్యేయం’

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు.

Published : 03 Jun 2023 02:11 IST

సమావేశంలో సంఘీభావం ప్రకటిస్తున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు అధ్యక్షతన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. టీఎన్‌టీయూసీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ వైకాపా నాలుగేళ్ల పాలనలో కార్మిక రంగం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. తెదేపా పాలనలో కార్మిక సంక్షేమ నిధి రూ.1600 కోట్లు కేటాయించగా.. వైౖకాపా ప్రభుత్వం నిధిని ఇతర పథకాలకు మళ్లించిందని ఆరోపించారు. చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ దక్కిందన్నారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన సమస్యలను తెదేపా మేనిఫెస్టోలో  పొందుపరిచేందుకు టీఎన్‌టీయూసీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. తెదేపా తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ కార్మికులకు అండగా నిలిచిన ఘనత తెదేపాదేనన్నారు. తెలుగునాడు విద్యుత్తు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సుగుణాకర్‌రావు మాట్లాడుతూ విద్యుత్తు సంస్థను దివాలా తీయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో టీఎన్‌టీయూసీ గౌరవ అధ్యక్షుడు శేషగిరిరావు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జయరామిరెడ్డి, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబూరి సింధూజ, వివిధ సంఘాల నాయకులు మురళి, రాధాకృష్ణ, సత్యనారాయణ, మాధవనాయుడు, మల్లిఖార్జునరావు, లక్ష్మీపతినాయుడు, రెడ్డెప్పనాయుడు, మధు, బాలాజీ, సుబ్రహ్మణ్యం, మధు, ఆముదాల తులసీరామ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని