logo

తుమ్మూరు చెరువులో బరితెగింపు

సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉంటేచాలు.. ఆయనకు ఓమాట చెప్పి ఒకే అనిపించుకుంటే చాలు.. అన్నరీతిలో అక్రమార్కులు చెలరేగుతున్నారు.

Published : 04 Jun 2023 03:08 IST

మట్టి కోసం ఏకంగా కట్ట తవ్వకం

తవ్వేసిన చెరువు కట్ట

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉంటేచాలు.. ఆయనకు ఓమాట చెప్పి ఒకే అనిపించుకుంటే చాలు.. అన్నరీతిలో అక్రమార్కులు చెలరేగుతున్నారు. నాయుడుపేట పరిధిలో ఏకంగా చెరువు కట్టనే ధ్వంసం చేసి మట్టి తరలింపునకు తెగపడటం ఇందుకు నిదర్శనం.. పురపాలక పరిధిలోని తుమ్మూరు చెరువు నుంచి మట్టి తరలింపునకు రంగం సిద్ధం చేశారు. లక్షలాది నిధులతో నిర్మించిన చెరువుకట్టను తవ్వేసి దారి ఏర్పాటు చేశారు. మట్టి తరలింపునకు జలవనరుల శాఖ నుంచి అనుమతులు రాకనే శుక్రవారం రాత్రి తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక్కడి జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో వెలసిన స్థిరాస్తి క్షేత్రాలకు మట్టిని విక్రయించేందుకు ఈ చెరువును ఎంచుకున్నారు. తుమ్మూరు, నరసరారెడ్డి కండ్రిగ, పాపారెడ్డి కండ్రిగ, విన్నమాల గ్రామాల పరిధిలోని 600 ఎకరాలకు చెరువు నుంచి సాగునీరు అందుతుంది. లోపల గుంతలు తీస్తే తూముల నుంచి నీరుపారే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

* తవ్వకాల విషయమై జలవనరుల శాఖ ఏఈ వీరాస్వామిని వివరణ కోరగా మట్టి తరలింపునకు దరఖాస్తు చేసినా అనుమతులు ఇంకా రాలేదన్నారు. ఉన్నతాధికారులకు నివేదించామని, అక్రమ తరలింపుపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని