logo

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. అతను 44 కేసుల్లో నిందితుడిగా గుర్తించారు.

Published : 04 Jun 2023 03:08 IST

44 చోరీ కేసులు.. రూ.40 లక్షల సొత్తు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి వస్తువులు పరిశీలిస్తున్న ఎస్పీ తదితరులు

తిరుపతి(నేరవిభాగం): తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. అతను 44 కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. దొంగ నుంచి రూ. 40 లక్షల విలువైన 793 గ్రాముల బంగారు, 1235 గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీపీవో శనివారం ఎస్పీ పరమేశ్వరరెడ్డి శనివారం విలేకర్లకు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు అలిపిరి సీఐ అబ్బన్నకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ చిన్న రెడ్డెప్ప, సిబ్బంది తిమ్మినాయుడు పాళెం బస్టాండు వద్దకు చేరుకున్నారు. వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా విశాఖపట్నం జిల్లాలోని సీతంపేటకు చెందిన బోడబతుల శీను (34)గా గుర్తించారు. అతను ప్రస్తుతం మంగళం వెంకటేశ్వర కాలనీలో వాటర్‌ ట్యాంకు వద్ద నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో వరస చోరీలకు పాల్పడ్డట్లు అంగీకరించారు. 2010 నుంచి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుచానూరు, తిరుపతి సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 35కు పైగా దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు. ప్రస్తుతం అలిపిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 9 కేసులు నమోదు చేశారు. సీఐ అబ్బన్న, ఎస్‌ఐలు చిన్నరెడ్డెప్ప, జయచంద్ర, ఇమ్రాన్‌ బాష, సిబ్బందికి రివార్డులు అందజేశారు. అదనపు ఎస్పీ వెంకట్రావు, డీఎస్పీ సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని