logo

అంశాలు ఘనం.. అమలే ప్రశ్నార్థకం

శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సమావేశానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఆలయ పరిపాలన భవనంలోని సమావేశపు హాలులో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులందరూ శుక్రవారం సమావేశం కానున్నారు.

Published : 09 Jun 2023 03:59 IST

అక్రమాలకు అడ్డుపడేనా..
నేడు మండలి సమావేశం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సమావేశానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఆలయ పరిపాలన భవనంలోని సమావేశపు హాలులో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులందరూ శుక్రవారం సమావేశం కానున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన ఆర్నెళ్లలో రెండో సమావేశం. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు జనవరి 21వ తేదీన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.

ధర్మకర్తల మండలి సమావేశం అవడం, ఒక్కో దఫా 40 నుంచి 60 అంశాలకు సంబంధించి తీర్మానాలు చేయడం, నిర్ణయాల అమలుపై సుదీర్ఘంగా చర్చించడమే తప్ప పరిష్కరించినవి అయితే అంతంతమాత్రమే. తాజాగా గురువారం జరిగే సమావేశానికి సంబంధించి దాదాపు 40 అంశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. వీటిల్లోనూ ఎన్ని నిర్ణయాలు అమలవుతాయి.. ఎన్ని కాగితాలకు పరిమితం అవుతాయన్నది వేచిచూడాల్సిందే.

* కాళహస్తీశ్వరాలయంలో అడుగడుగునా జరుగుతున్న అక్రమాలపై ధర్మకర్తల మండలి ఎంత మేరకు స్పందిస్తుందన్న విషయం ప్రశ్నార్థకమే.

* ప్రధానంగా దళారుల బెడద ఎక్కువైంది. పార్కింగ్‌ ప్రదేశాలు, ప్రవేశ గోపురాల నుంచే దందా జరుగుతోంది. ఆలయానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబులకు చేరుతోంది. దీన్ని కట్టడి చేసే విధంగా ఏమేరకు చర్చ జరుపుతారో చూడాలి మరి.

* క్రైలాసగిరుల్లో మట్టి దందా అనూహ్యంగా జరుగుతోంది. స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇవన్నీ తెలిసినా ఆలయ అధికారులు అటువైపుగా వెళ్లిన దాఖలాలు లేవు. ఆక్రమణపై దృష్టి సారించాలి.

* త్రొలుత కైలాసగిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేశాక ఇతరత్రా అభివృద్ధిపై ధర్మకర్తల మండలి దృష్టి సారించాల్సి ఉంది.


* ఆలయానికి సంబంధించి వాహనాల పార్కింగ్‌, లగేజీ కేంద్రాలు, చరవాణుల కౌంటర్లలో జరుగుతున్న భారీ అక్రమాలు, కనీసం సూచిక బోర్డులు లేకపోవడంతో ఇష్టం వచ్చిన రీతిలో వసూలు చేయడంపై తరచూ విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని