కూలీలు దొరక్క.. సాగు చేయలేక
దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగానికి కూలీలు కరవవుతున్నారు.. జాతీయ ఉపాధి హామీ పథక ఉద్దేశం మంచిదైనా జిల్లాలో డెల్టా ప్రాంతాలైన తూర్పు మండలాల్లో కూలీల కొరత అన్నదాతను తీవ్రంగా వేధిస్తోంది..
ఉపాధి పనులకే పరిమితం
బీళ్లుగా భూములు
నగరి, న్యూస్‌టుడే: దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగానికి కూలీలు కరవవుతున్నారు.. జాతీయ ఉపాధి హామీ పథక ఉద్దేశం మంచిదైనా జిల్లాలో డెల్టా ప్రాంతాలైన తూర్పు మండలాల్లో కూలీల కొరత అన్నదాతను తీవ్రంగా వేధిస్తోంది.. ఉపాధి పనులకు వెళ్తోన్న కూలీలు క్రమేపీ వ్యవసాయ పనులు మరచిపోతున్నారని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా చెరకు, వరి, వేరుసెనగ, పూల తోటలతో ఏడాది పొడవునా పంటలు పండిచే నగరి నియోజకవర్గంలో కూలీలు లేక భూములు బీడుగా మారుతున్నాయి.. గతంలో వరినాట్లు, కలుపు తీయడం, పంట కోతలు, నూర్పిడి పనులకు అందుబాటులో ఉండేవారు.. ప్రస్తుతం ఉపాధి పనులకు పరిమితమై, పొలాల వైపు రావడం లేదని అంటున్నారు.
ఆవేదనలో అన్నదాతలు.. ఇటీవల నగరి మండల సమావేశానికి మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో అన్నదాతలు వ్యవసాయ కూలీల కొరత సమస్య ప్రధానంగా ఉందని, భవిష్యత్‌లో పంటలు పండించడం సాధ్యం కాదని ఆమె దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పథకం అమలు విధానంలో కొంత వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఇందుకు విరుద్ధమని అధికారులు సమాధానం చెప్పడంతో, ప్రత్యామ్నాయం చూపాలని రైతులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుకూలంగా వ్యవసాయ రంగానికి ఎందుకు అనుసంధానం చేయరాదని రైతులు ప్రశ్నించారు. అవసరం ఉన్న మండలాల్లోనైనా కూలీలను వ్యవసాయ పనులకు పంపాలని డిమాండ్ చేశారు.
కొంతమేరే యంత్రాల సాయం.. సాగులో అన్ని పనులు యంత్రాలతో సాధ్యం కాదు. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు కూలీలపైనే ఆధారపడతారు. వరినాట్లు, కలుపులు, కూరగాయలు, పూల తోటల్లో పనులకు వారి అవసరం చాలా ఉంది. ఉపాధి పనులున్న రోజుల్లో కూలీలు అందుబాటులో లేక వ్యవసాయం స్తంభించపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో వంద రోజులు ఉపాధి పనులు ఉంటాయి. మిగిలిన రోజుల్లోనే వ్యవసాయ పనులకు కూలీలు వస్తారు. అదునులో పనులకు కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నగరి ప్రాంతంలో సాగు ఇలా..
చెరకు: 3,260 హెక్టార్లు
వేరుసెనగ: 1,370 హెక్టార్లు
వరి: 4,325 హెక్టార్లు
పొద్దుతిరుగుడు: 670 హెక్టార్లు
నువ్వులు: 70 హెక్టార్లు
ఉపాధి కూలీలు: 17వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా