logo

పూతలపట్టు ఎమ్మెల్యేకు నిరసన సెగ

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకు తెదేపా శ్రేణుల నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం మొగిలివారిపల్లె దళితవాడలో పర్యటన ముగించుకుని మొగిలివారిపల్లెకు వచ్చారు.

Published : 09 Jun 2023 03:59 IST

మొగిలివారిపల్లెలో కట్టిన తెదేపా జెండాలు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకు తెదేపా శ్రేణుల నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం మొగిలివారిపల్లె దళితవాడలో పర్యటన ముగించుకుని మొగిలివారిపల్లెకు వచ్చారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటిస్తారన్న సమాచారంతో తెదేపా శ్రేణులు ముందే ఇళ్ల గోడలకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి గోడపత్రికలు అతికించారు. వీధులను తెదేపా జెండాలు, తోరణాలతో అలంకరించారు. ఎమ్మెల్యే గ్రామంలోని రాగానే గుడి వద్ద ఉన్న మైకులో ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అంటూ పాట పెట్టారు. గ్రామ సమస్యలు పట్టించుకోలేదని, అటవీ ప్రాంత సరిహద్దులోని పొలాల్లో ఏనుగుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అసహనానికి గురైన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆపై జయంతి గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ అమరావతి, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు సోమశేఖర్‌, ఎంపీడీవో హరిప్రసాద్‌రెడ్డి, తహసీల్దారు బెన్నురాజు పాల్గొన్నారు. గ్రామంలోని ఆలయ మైకులో తెదేపా పాటలు వినిపిస్తూ కార్యక్రమానికి భంగం కలిగించారంటూ స్థానిక వైకాపా నాయకుడు సోమేశ్వరప్రభు ఫిర్యాదు మేరకు తెదేపా నాయకులు దిలీప్‌ చౌదరి, విజయకుమార్‌, బాలసుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశామని సీఐ నరసింహారెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని