logo

శాస్త్రోక్తంగా చక్రస్నానం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ప్రసన్న వేంకటేశ్వరస్వామి చక్రస్నానం వేడుక గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకన్న దివ్యాలంకార భూషితుడై పల్లకీలో విహరిస్తుండగా భక్తులు విచ్చేసి నీరాజనాలు సమర్పించారు

Published : 09 Jun 2023 03:59 IST

తిరువీధుల విహరిôచిన దేవదేవుడు
ముగిసిన ప్రసన్న వేంకన్న బ్రహ్మోత్సవాలు

ఉభయ దేవేరులతో ప్రసన్న వేంకన్న

వడమాలపేట, న్యూస్‌టుడే: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ప్రసన్న వేంకటేశ్వరస్వామి చక్రస్నానం వేడుక గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకన్న దివ్యాలంకార భూషితుడై పల్లకీలో విహరిస్తుండగా భక్తులు విచ్చేసి నీరాజనాలు సమర్పించారు. అనంతరం  ఉత్సవమూర్తులకు, సుదర్శన చక్రానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదపండితుల మంత్రో చ్చారణ నడుమ సుదర్శన చక్రానికి నీటిలో స్నానమాచరింపజేసి శాస్త్రోక్తంగా ముగించారు. సాయంత్రం ధ్వజావరోహణ ముహూర్తంలో గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయాధికారులు శివకుమార్‌, అర్చకులు సూర్యకుమారాచార్యులు, తిప్పాచార్యులు, రమణాచార్యులు పాల్గొన్నారు.

చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని