logo

వరల్డ్‌ యూత్‌ పోటీలకు నాయుడుపేట కుర్రాడు

తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్‌నగర్‌కు చెందిన తిరుమూరు గణేష్‌ మణిరత్నం జులై 1 నుంచి 10వ తేదీ వరకు ఐర్లాండ్‌ దేశంలో జరిగే వరల్డ్‌ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు.

Published : 10 Jun 2023 02:53 IST

జులై 1 నుంచి ఐర్లాండ్‌లో విలువిద్య పోటీలు

గణేష్‌ మణిరత్నంతో ఏపీ ఆర్చరీ సంఘం కార్యదర్శి సత్యనారాయణ, కోచ్‌ కమల్‌ కిషోర్‌

నాయుడుపేట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్‌నగర్‌కు చెందిన తిరుమూరు గణేష్‌ మణిరత్నం జులై 1 నుంచి 10వ తేదీ వరకు ఐర్లాండ్‌ దేశంలో జరిగే వరల్డ్‌ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. బాల్యం నుంచి ఆర్చరీలో ప్రతిభ చూపుతున్న ఈ యువ క్రీడాకారుడు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. 2022లో జరిగిన 42వ జాతీయస్థాయి పోటీల్లో రజతం, సీబీఎస్‌ఈ జాతీయ పోటీల్లో రెండు పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పుర్‌ కేంద్రంగా జరిగిన ఖేలోఇండియా యూత్‌ గేమ్స్‌లో.. సీబీఎస్‌ఈ జాతీయస్థాయి పోటీల్లో రజతాలు సాధించాడు. గత ఏడాది ఆసియా స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించి హరియాణా రాష్ట్రం సోనిపేట కేంద్రంలోని అకాడమిలో శిక్షణ పొందాడు. ఐర్లాండ్‌ దేశంలో లిమిరిక్‌ కేంద్రంగా జరగనున్న పోటీల్లో భారత్‌ నుంచి పాల్గొనే 36 మందిలో క్యాడెట్‌ కాంపౌండ్‌ విభాగంలో తలపడనున్నాడు. ఈ సందర్భంగా ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌ కార్యదర్శి పరుచూరు సత్యనారాయణ, కోచ్‌ కమల్‌ కిషోర్‌, తల్లిదండ్రులు తిరుమూరు హరిప్రసాద్‌, సుప్రియ, తాత సుబ్రహ్మణ్యంలు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని