నిమ్మ మార్కెట్‌లో ధరలపై ఆరా
గూడూరు నిమ్మ మార్కెట్‌లో ప్రభుత్వ నిబంధనల మేరకే కమీషన్ వసూలు చేయాలని, ధరలను ప్రదర్శించి పారదర్శకంగా అమ్మకాలు చేపట్టాలని గూడూరు ఉద్యానశాఖాధికారి కార్తిక్ తెలిపారు.
ధరలపై ఆరా తీస్తున్న ఉద్యానశాఖాధికారి కార్తిక్
గూడూరు గ్రామీణం: గూడూరు నిమ్మ మార్కెట్‌లో ప్రభుత్వ నిబంధనల మేరకే కమీషన్ వసూలు చేయాలని, ధరలను ప్రదర్శించి పారదర్శకంగా అమ్మకాలు చేపట్టాలని గూడూరు ఉద్యానశాఖాధికారి కార్తిక్ తెలిపారు. ఈనెల 8న ‘ఈనాడు’లో ‘దగాపడ్డ నిమ్మ రైతు’ శీర్షికన కథనం రావడంతో ఉన్నతాధికారులు గూడూరు మార్కెట్‌లో నిమ్మధరలు, రైతులు పడుతున్న ఇబ్బందులపై సమగ్రంగా నివేదించాలని ఆదేశించడంతో ఉద్యాన శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలాజీ లెమన్ మార్కెట్‌ను తనిఖీ చేసి దుకాణాల్లో అమలవుతున్న ధరలు, రైతుల వద్ద తీసుకుంటున్న కమీషన్, రైతులకు కల్పిస్తున్న వసతులు, రాష్ట్రంలో ఇతర నిమ్మ మార్కెట్ల పనితీరు తదితర అంశాలపై ఆరాతీశారు. మార్కెట్ కమిటీ సిబ్బంది నుంచి రోజూ ఎన్ని లారీల్లో సరకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నది, రైతుల నుంచి సెస్ ఎంత వసూలు చేస్తున్నది వివరాలు సేకరించారు. వ్యాపారులు పలు సమస్యలను అధికారుల దృష్టి తీసుకెళ్లారు. అయితే అధికారులు రైతుల నుంచి ఎలాంటి వివరాలు సేకరించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.