వడగాడ్పులతో జాగ్రత్త
వడగాడ్పులు తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యాహ్న సమయం సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది
* వడగాడ్పులు తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యాహ్న సమయం సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయం ఎండలో ఉన్నా సరే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
* వేడి గాలులు కళ్లు, చెవుల్లోకి పోకుండా ముఖానికి చేతి రుమాలు కట్టుకోవాలి. చలువ అద్దాలు ధరించడం వల్ల నేత్రాలకు నేరుగా యూవీ కిరణాలు తగలకుండా చూసుకోవచ్చు. అత్యవసరమై ఎండలోకి వెళ్లాల్సి వస్తే.. గొడుగు వాడాలి. చేతిలో నీటి సీసా తప్పనిసరి.
* ఇంట్లోకి వేడి గాలులు రాకుండా ద్వారానికి పరదాలు, వట్టివేర్ల చాపలు కట్టుకోవాలి. వీటిని అప్పుడప్పుడు తడుపుతుండటం వల్ల చల్లని గాలి వస్తుంది. కిటికీల తలుపులు మూసివేయాలి.
* వడగాడ్పుల సమయంలో ఫ్యాన్లకు బదులు కూలర్లు వేసుకోవాలి. కిటికీల వద్ద టేబుల్ ఫ్యాన్లు పెట్టడం వల్ల బయట నుంచి వచ్చే వేడి గాలి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి వాతావరణం మరింత వేడెక్కిస్తుంది.
* ఎవరిలోనైనా నీరసం, నిస్సత్తువ, కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు, అధిక చెమట, పసుపు వర్ణంలో మూత్రం, ఆందోళన, కండరాలు పట్టేయడం లాంటి లక్షణాలు కన్పిస్తే.. వారికి వడదెబ్బ తగిలినట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా
-
YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. వీడియో ఎడిటింగ్‌కు ఫ్రీ యాప్
-
Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?
-
NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్