logo

ప్రవేశ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించండి

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కట్టుదిట్టంగా నిర్వహించాలని డీఈవో విజయేంద్రరావు.. ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

Published : 10 Jun 2023 03:07 IST

ప్రిన్సిపాళ్లతో సమావేశమైన డీఈవో విజయేంద్రరావు

చిత్తూరు విద్య: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కట్టుదిట్టంగా నిర్వహించాలని డీఈవో విజయేంద్రరావు.. ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏడు పాఠశాలలో ప్రవేశానికి 751మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి ఆయా పాఠశాలల్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 11న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటలకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష ప్రారంభానికి ముందు ఓఎంఆర్‌ షీట్లపై ఇన్విజిలేటర్లు విద్యార్థులకు తప్పక అవగాహన కల్పించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని