logo

తుప్పు పడుతున్నా..మెప్పు కోసం

తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో తెదేపా హయాంలో మంజూరైన 1,006 గృహాల్లో.. 426 మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన గృహాలకు వైకాపా రంగులు వేస్తున్నారు.

Published : 22 Sep 2023 02:41 IST

టిడ్కో గృహాలనూ వదల్లేదు

తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో తెదేపా హయాంలో మంజూరైన 1,006 గృహాల్లో.. 426 మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన గృహాలకు వైకాపా రంగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేశారు. ఎన్నికలు రావడంతో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ గృహాల పనులు పూర్తిగా ఆపేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన వాటినే ఈ ఏడాది చివరకు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడానికి ఇటీవల మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి మంత్రి ఆర్‌కే రోజా భూమిపూజ చేశారు. ఇక పునాదుల్లో నిలిచిన గృహాల్లో ఇనుము పూర్తిగా తుప్పు పడుతుంటే.. మరోవైపు అధికార పార్టీ మెప్పు కోసం రంగులు వేస్తుండటం గమనార్హం.

న్యూస్‌టుడే, పుత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని