logo

అదరక.. బెదరక

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 9వ రోజుకు చేరుకున్నాయి. 

Published : 22 Sep 2023 02:41 IST

గూడూరు : రిలే నిరాహార దీక్షలో కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి తదితరులు

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 9వ రోజుకు చేరుకున్నాయి.  తిరుపతిలోని పాత నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన సంతకాల సేకరణలో ప్రజలు పాల్గొని మద్దతు ప్రకటించారు. చంద్రగిరిలో ఆ పార్టీ బాధ్యుడు పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో భారీగా మహిళలు ర్యాలీలో పాల్గొని చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరులోని తెదేపా కార్యాలయంలో రిలే దీక్షలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌  పాల్గొన్నారు. వెంకటగిరి జీఎన్‌ఆర్‌ ట్రస్టు కార్యాలయంలో దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాల ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పలువురు పాల్గొని మద్దతు ప్రకటించారు. సూళ్లూరుపేట తెదేపా కార్యాలయంలో జరిగిన దీక్షలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి పరసారత్నం, నాయకుడు సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.  సత్యవేడులోని గంగమ్మ ఆలయం వద్ద నాయకులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద ఆ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. చెన్నై రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టారు.



ఎస్వీ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కళ్లకు గంతలతో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుల ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని