logo

తాగునీరొచ్చి 21 రోజులైంది

‘సా రూ.. మా గ్రామం లో తాగునీరొచ్చి 21 రోజులైంది.. ఎలా బతికేది.. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేకున్నా పర్వాలేదు.. కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నాం..

Published : 22 Sep 2023 02:41 IST

ఆర్డీవో చంద్రమునికి సమస్య విన్నవిస్తున్న మహిళలు

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ‘సా రూ.. మా గ్రామం లో తాగునీరొచ్చి 21 రోజులైంది.. ఎలా బతికేది.. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేకున్నా పర్వాలేదు.. కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నాం.. మీరైనా ఆదుకోండి’.. అంటూ సూళ్లూరుపేట మండలం చెరువుమిట్టకు చెందిన మహిళలు ఆర్డీవో చంద్రముని ఎదుట గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచి చిలకా యుగంధర్‌ ఆధ్వర్యంలో సుళ్లూరుపేట తరలివచ్చి సమస్య వివరించారు. పులికాట్‌ తీరంలో ఉన్న తమ గ్రామానికి గతంలో వారానికోసారి 12 బిందెలు చొప్పున తాగునీరు ఇచ్చేవారని, ప్రస్తుతం 21 రోజులైందని, వినాయక చవితి పండగకు సైతం బిందెడు తాగునీరు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో పురపాలక కార్యాలయంలో ఉండటంతో  గంటకుపైగా చంటిబిడ్డలతో ఎండలోనే నిరీక్షించారు. ఆర్డీవో రావడంతో మహిళలు ఆయన్ను చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీవో ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ ఉమామహేశ్వరికి ఫోన్‌చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య రెండ్రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని