logo

కాలేయానికి క్లిష్టమైన సర్జరీ విజయవంతం

అమర ఆస్పత్రిలో కాలేయానికి సంబంధించి అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు ఆస్పత్రి సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ మునికృష్ణ తెలిపారు.

Published : 22 Sep 2023 04:50 IST

వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు

రేణిగుంట, న్యూస్‌టుడే: Qగురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న రాజశేఖర్‌ అనే 54 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా హేమాంగియోమా వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. లాప్రోస్కోపిక్‌ పద్ధతిలో కాలేయానికి క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా చేశామని తెలిపారు. ఇలాంటి సర్జరీలకు బెంగళూరు, చెన్నైకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఏవో వేణుగోపాల్‌, డాక్టర్‌ హేమంత్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని