logo

పాఠశాల దారి అడ్డగింత

పాఠశాలకు వెళ్లేదారికి అడ్డంగా ముళ్లకంచ వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీప పశువుల పాకలో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తిరుపతి జిల్లా వి.కోట మండల పరిధిలోని కొమ్మరమడుగు గ్రామంలో గురువారం చోటు చేసుకొంది.

Published : 22 Sep 2023 04:50 IST

పశువుల పాకలో నిరీక్షిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

వి.కోట: పాఠశాలకు వెళ్లేదారికి అడ్డంగా ముళ్లకంచ వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీప పశువుల పాకలో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తిరుపతి జిల్లా వి.కోట మండల పరిధిలోని కొమ్మరమడుగు గ్రామంలో గురువారం చోటు చేసుకొంది. ఆనేప్ప పాఠశాల భవన నిర్మాణానికి సుమారు 20 ఏళ్ల కిత్రం స్థలా న్ని ఇచ్చారు. ఈ స్థలం తమదని పాఠశాలకు వెళ్లేదారిలో ముళ్లకంపలు అడ్డంగా వేశారు. దీంతో ఎంఈవో చంద్రశేఖర్‌, ఎంపీపీ యువరాజ్‌, తహసీల్దార్‌ చిట్టిబాబు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ స్థలం పాఠశాలకు ఇచ్చినప్పటికీ రికార్డులో తమ పేర్లేచూపుతున్నాయని వారు అధికారులకు తెలియజేశారు. అయితే గతంలో దాతలు ఇచ్చిన స్థలాన్ని ఎలాంటి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాలను కోర్టులో చూసుకోవాలని ప్రస్తుతానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లడానికి దారివ్వాల్సిందిగా రెవిన్యూ అధికారులు వారికి నచ్చచెప్పారు. ఈ విషయమై సోమవారం మరోసారి పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించుకొందామని అంతవరకు దారిలో రాకపోకలు సాగించుకోవాలని అధికారులు కోరడంతో ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైంది. విద్యార్థులు మధ్యాహ్నం వరకు పశువుల పాకలోనే కాలంగడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని