logo

నిరుద్యోగ యువతకు ఆర్థిక పురోగతి

జాతీయ లైవ్‌స్టాక్‌ పథకం నిరుద్యోగ యువత, రైతులకు ఆర్థిక పురోగతి లభిస్తోందని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి అన్నారు.

Updated : 22 Sep 2023 05:38 IST

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి

చిత్తూరు (వ్యవసాయం): జాతీయ లైవ్‌స్టాక్‌ పథకం నిరుద్యోగ యువత, రైతులకు ఆర్థిక పురోగతి లభిస్తోందని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ లైవ్‌స్టాక్‌ మిషన్‌ పథకం అమలు, ప్రయోజనాలపై గురువారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో రైతులు, నిరుద్యోగ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్‌, ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీహరి, పశువైద్య కశాశాల ప్రొఫెసర్లు దేవసేన, కల్యాణ చక్రవర్తి, డీడీలు, ఏడీలు, పశువైద్యాధికారులు, ఔత్సాహిక పాడి రైతులు, గొర్రెల పెంపకందారులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని