logo

గాలి రాదు.. కుర్చీలు లేవు

జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం పారామెడికల్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 18 ప్రైవేటు కళాశాలల్లోని 16 కోర్సులకు సంబంధించి 604 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 580 మందికి ప్లేస్‌మెంట్‌ ఇచ్చారు.

Updated : 27 Sep 2023 06:39 IST

పారామెడికల్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల ఉక్కిరిబిక్కిరి

చెట్ల కింద నిల్చున్న విద్యార్థులు

ఈనాడు, చిత్తూరు-న్యూస్‌టుడే, చిత్తూరు(వైద్యం): జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం పారామెడికల్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 18 ప్రైవేటు కళాశాలల్లోని 16 కోర్సులకు సంబంధించి 604 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 580 మందికి ప్లేస్‌మెంట్‌ ఇచ్చారు. డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి, ఏవో విజయ్‌బాబు పర్యవేక్షించారు. కాగా.. కౌన్సెలింగ్‌ భవనం పైఅంతస్తులో నిర్వహించారు. ఉదయం 9 గంటలకే వచ్చిన అభ్యర్థులకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవటంతో కొందరు హాలులో కూర్చున్నారు. అనేకమంది నిలబడలేక భవనం బయట చెట్ల కింద, వాహనాలపై, మెట్లపై, మందుల డబ్బాలపై, నేలపై పేపర్లు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. అనేక మంది అభ్యర్థులు తమను పిలుస్తారేమో అని కౌన్సెలింగ్‌ హాల్‌ ముందు నిరీక్షించారు. అక్కడ కనీసం ఫ్యాన్లు కూడా తిరగకపోవటంతో ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు