logo

హామీలు అమలు చేయమంటే అణచివేత దారుణం

సీఎం జగన్‌ పాదయాత్ర, ఎన్నికల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తే.. పోలీసులతో అణచివేయడం, అరెస్టులు చేయడం దారుణమని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు నాగరాజన్‌, వాడ గంగరాజు మండిపడ్డారు.

Published : 27 Sep 2023 06:27 IST

నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం, సీపీఐ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు

చిత్తూరు గ్రామీణ: సీఎం జగన్‌ పాదయాత్ర, ఎన్నికల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తే.. పోలీసులతో అణచివేయడం, అరెస్టులు చేయడం దారుణమని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు నాగరాజన్‌, వాడ గంగరాజు మండిపడ్డారు. గాంధీ విగ్రహం ఎదుట మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యల పరిష్కారం నిమిత్తం సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన తీరు బ్రిటిష్‌ పాలన విధానాన్ని తలపిస్తోందన్నారు. మహిళ ఓటర్లతో గద్దెనెక్కి వారి సమస్యల్ని పరిష్కరించకపోగా.. వారినే అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం శోచనీయమన్నారు. ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర, సురేంద్రన్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం జిల్లా నాయకులు సుజని, ప్రభావతి, సునీత, బిందు, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని