logo

అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నాం

పెనుమూరు మండలంలో ఇంటర్‌ విద్యార్థిని మృతిని అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఈబీ(సెబ్‌) ఏఎస్పీ శ్రీలక్ష్మీ తెలిపారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

Published : 27 Sep 2023 06:27 IST

అవాస్తవాలు, ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దు: సెబ్‌ ఏఎస్పీ

మాట్లాడుతున్న ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మీ

చిత్తూరు(నేరవార్తలు): పెనుమూరు మండలంలో ఇంటర్‌ విద్యార్థిని మృతిని అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఈబీ(సెబ్‌) ఏఎస్పీ శ్రీలక్ష్మీ తెలిపారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 18న తన కుమార్తె(16) ఆచూకీ తెలిపాలని తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. 20న ఓ బావిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఇంటర్‌ విద్యార్థినిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించాం. ఇది ఆత్మహత్య కాదని, అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. నలుగురు యువకులపై అనుమానం ఉందనడంతో విచారిస్తున్నాం. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి తల్లిదండ్రుల ఎదుటే శవపరీక్ష చేశారు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానంతో మృతురాలి నుంచి కొన్ని శాంపుల్స్‌ తీసుకుని తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాం. ఈ రిపోర్టుతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు వెలుగు చూస్తాయి. అంతవరకు అవాస్తవాలు, ఊహాగానాలు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పపు’ అని సెబ్‌ ఏఎస్పీ చెప్పారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.


వినాయకుడి మండపం వద్ద విద్యుదాఘాతంతో యువకుడి మృతి

జీడీనెల్లూరు: ఇరగమరెడ్డికండిగలో సోమవారం రాత్రి వినాయక చవితి ఉత్సవాల్లో మండపం వద్ద విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కుమార్‌(26) మంగళవారం మృతిచెందారు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహం కాగా.. మూడు నెలల కుమార్తె ఉంది. వ్యవసాయ కూలీ అయిన విజయ్‌కుమార్‌ సోమవారం వినాయకచవితి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ.. విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంపై కుటుంబీకులతోపాటు గ్రామస్థులు విలపించారు. ఎస్సై ఉమామహేశ్వర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు