logo

సర్వదర్శనానికి మూడుగంటలు

శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా మంగళవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

Published : 27 Sep 2023 06:27 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా మంగళవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు మూడు గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. శ్రీవారిని సోమవారం 72,137 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.37 కోట్లు లభించాయి.


అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుచానూరు: శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి  అంకురార్పణ జరిగింది. సాయంత్రం ఆలయంలో విష్వక్సేనుడి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది. డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏఈవో రమేష్‌, అర్చకులు బాబుస్వామి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని