దీక్షలో వనిత.. బాబు అరెస్టుకు వ్యతిరేకత
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు రోజుకో తీరున నిరసనలు చేపడుతున్నారు.
రిలే నిరాహారదీక్షలో మహిళలు
కాశిపెంట్లలో తెదేపా చేపట్టిన రిలే దీక్షలో మహిళలతో పులివర్తి సుధారెడ్డి
తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు రోజుకో తీరున నిరసనలు చేపడుతున్నారు. మంగళవారం తిరుపతి పాత నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట జరిగిన రిలే నిరాహారదీక్షలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ నేత నరసింహయాదవ్ తదితరులు చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు నగరంలోని కరుమారియమ్మ ఆలయంలో చంద్రబాబు కోసం తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరిలోని బస్టాండ్ కూడలి వద్ద ఆ పార్టీ బాధ్యుడు పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గూడూరులోని తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో, వెంకటగిరిలో నియోజకవర్గం రావూరులో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. శ్రీకాళహస్తిలోని తెదేపా కార్యాలయం వద్ద తొట్టంబేడు మండలానికి చెందిన ఆ పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. పార్టీ బాధ్యుడు బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. తొట్టంబేడు మండలానికి చెందిన తంగేళ్లపాలెం వద్ద ఆ పార్టీ నాయకులు జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట తెదేపా కార్యాలయంలో చంద్రబాబు ఆరోగ్యం కోసం రుద్రాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి పరసారత్నం, నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యవేడులోని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన దీక్షలో పార్టీ బాధ్యురాలు హెలెన్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహం
[ 02-12-2023]
శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి, తిరుమలకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడి పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తెదేపా అధినేతకు జనం నీరాజనం పట్టారు. -
బాధ్యతగా వ్యవహరిద్దాం.. ఓటుహక్కు నిలుపుకొందాం
[ 02-12-2023]
ఓటరు జాబితాలో మీ వివరాలు తప్పుగా దొర్లాయా? కుటుంబసభ్యుల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్నాయా? మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలో కాకుండా వేరేచోట ఓటుహక్కు ఉందా? 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు లేదా? ఇంట్లో ఎవరైనా మరణించినా వారి పేరు జాబితాలోనే అలానే ఉందా? ఇలాంటి తప్పిదాలను సరిచేసుకునేందుకు, కొత్తగా ఓటుహక్కు పొందేందుకు ఈనెల 9 వరకు అవకాశం ఉంది. -
మనదే.. తవ్వేయ్.. దోచేయ్
[ 02-12-2023]
భారీ పొక్లెయిన్లు, యంత్ర సామగ్రి సాయంతో సహజ కొండలు తవ్వేశారు.. టిప్పర్లు వరుస కట్టగా రేయింబవళ్లు వాహనాలతో అక్రమంగా తరలించారు.. తమ సంపద కొల్లగొడుతున్నారని అధికారులకు విజ్ఞప్తులు చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు.. దీంతో గనులశాఖ నుంచి తీసుకున్న అనుమతుల కంటే అధికంగా తవ్వి సొమ్ము చేసుకోవడం గమనార్హం. -
లగేజీ కౌంటర్ల వద్ద డబ్బులు అడుగుతున్నారు
[ 02-12-2023]
‘తిరుమలలోని లగేజీ కౌంటర్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బ్యాగులు విసిరేస్తున్నారు. నా బ్యాగులోని కొన్ని దుస్తులు కనిపించడం లేద’ని రాజమండ్రికి చెందిన కుమార్ తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. -
బకాయిలు కట్టకుంటే విద్యుత్తు కట్
[ 02-12-2023]
బకాయిలు కట్టుకుంటే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామంటూ రెస్కో అధికారులు శుక్రవారం సాయంత్రం కుప్పం పట్టణంలో హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం నుంచి మిన్నకుండిన అధికారులు సాయంత్రం 5.45 సమయంలో గృహాలు, దుకాణాల వద్దకు వచ్చి బకాయిలు కట్టాలంటూ డిమాండ్ చేశారు. -
ఆ ముగ్గురూ..!
[ 02-12-2023]
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా జాతీయ స్థాయిలో పాల్గొనేలా తీర్చిదిద్దడంలో ఈ మహిళా వ్యాయామ సంచాలకులు అవిరళ కృషి చేశారు.. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.. ఇలా ఎంతోమందిని తీర్చిదిద్ది ఉద్దండులుగా పేరొందారా మహిళా వ్యాయామ సంచాలకులు. -
త్వరలో జోన్‌కు 500 ఆర్టీసీ బస్సులు: ఈడీ
[ 02-12-2023]
ఆర్టీసీ అభివృద్ధి బాటలో నడుస్తోందని, మున్ముందు మరింత అభివృద్ధి సాధిస్తామని కడప జోన్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
క్లిక్ మనిపిస్తూ ... క్లిక్కయ్యాడు
[ 02-12-2023]
ఆ యువకుడికి వన్యప్రాణులు, అరుదైన పక్షులు, ప్రకృతి రమణీయతను ఛాయా చిత్రాలలో బంధించడమంటే సరదా. ఖాళీగా ఉంటే కెమెరా పట్టుకుని గ్రామానికి సమీపంలోని అడవిలో తిరుగుతూ రోజంతా గడిపేవాడు. -
ఈ రోడ్డుకు 30 ఏళ్లు..!
[ 02-12-2023]
తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల ప్రజల రాకపోకలకు అనువుగా రూ.కోటితో నిర్మించ తలపెట్టిన అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణం 30 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఈ రహదారి నిర్మాణాన్ని పట్టించుకోక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.. కేవలం కిలోమీటరున్నర మేర నిలిచిన రహదారి పనులకు కారణం సమీప తమిళనాడు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడమే.. -
ప్రక్షాళనకు సమయమిదే!
[ 02-12-2023]
‘మా నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల అండదండలతో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు చేస్తున్నారు.. చనిపోయిన వ్యక్తుల పేర్లు కొనసాగిస్తున్నారు.. శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లను కొనసాగిస్తున్నారు.. డబ్లింగ్ ఓట్లూ ఉన్నాయి..’ ..ఇవీ నిత్యం విపక్షాలతోపాటు ప్రజలు చేస్తున్న వ్యాఖ్యలు. -
సాదాబైనామాలకు సచివాలయాల్లో వసూళ్లు!
[ 02-12-2023]
సాదాబైనామాల దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు సచివాలయాలు వేదికగా మారాయి. దరఖాస్తులకు డిసెంబర్ ఆఖరుతో గడువు తీరనుండటంతో రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొందరు.. వైకాపా నాయకులను దళారీలుగా ఏర్పాటు చేసుకుని వారి నుంచి వసూళ్ల తెరతీసి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు గుంజుతున్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం.. అక్కడే పోలింగ్ కేంద్రం
[ 02-12-2023]
చంద్రగిరి నియోజకవర్గం కందులవారిపల్లి పంచాయతీ హరిజనవాడలోని అంగన్వాడీ కేంద్రంలో పద్దెనిమిది మంది చిన్నారులున్నారు. భవనం అందుబాటులో లేక గ్రామంలోని సమావేశ మందిరంలో కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో కనీస మౌలిక వసతులులేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
సర్వదర్శనానికి 5 గంటలు
[ 02-12-2023]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 5 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. -
గోవిందరాజస్వామి ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
[ 02-12-2023]
స్థానిక శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. -
మొరాయించిన ఈకేవైసీ సర్వర్లు
[ 02-12-2023]
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈకేవైసీ సర్వర్లు మొరాయించాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సర్వర్లు అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా శుక్రవారం జరగలేదు.


తాజా వార్తలు (Latest News)
-
T20I Record: టీ20ల్లో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు..
-
Salaar: 114 రోజుల్లోనే ‘సలార్’ను పూర్తిచేశాం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రశాంత్ నీల్
-
Sangareddy: కారు బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి
-
Gutha Sukender Reddy: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ‘సాగర్’ దుశ్చర్య: గుత్తా
-
Respiratory illness: చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్‌ను కోరిన సెనెటర్లు
-
Prasidh Krishna: వన్డేల్లో హిట్టు.. టీ20ల్లో ఫట్టు .. ప్రసిద్ధ్ పంజా విసిరేనా?