logo

Cyber Crime: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ లింక్స్‌తో జర భద్రం!

ఆధార్‌ కార్డు, బ్యాంకు కేవైసీ, కరోనా టీకా.. ఇలా ప్రతి అంశాన్ని సైబర్‌ మాయగాళ్లు అనుకూలంగా మలచుకుని రూ.లక్షలు కాజేస్తున్నారు...

Updated : 21 Mar 2022 07:23 IST

సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసుల అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: ఆధార్‌ కార్డు, బ్యాంకు కేవైసీ, కరోనా టీకా.. ఇలా ప్రతి అంశాన్ని సైబర్‌ మాయగాళ్లు అనుకూలంగా మలచుకుని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రస్తుతం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా లింక్‌ రూపంలో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా వచ్చే సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఫేస్‌బుక్, ట్విటర్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. మోసపోయినట్టు గుర్తించగానే సైబర్‌ క్రైమ్‌ సహాయ కేంద్రం 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు