logo
Published : 13/09/2021 05:33 IST

అగ్రిగోల్డ్‌ బాధితులకు పూర్తిన్యాయం చేయాలి

అసోసియేషన్‌ జిల్లా సమావేశంలో పాల్గొన్న నాయకులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.3వేల కోట్లు అందించి పూర్తి న్యాయం చేకూర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని అంబళ్ల సూర్యారావు భవన్‌లో జరిగిన అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎనిమిది రాష్ట్రాల్లో 32 లక్షల మందిని మోసం చేసి ఏడున్నర వేల కోట్లు కొల్లగొట్టిన అగ్రిగోల్డ్‌ సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, యాజమాన్యం కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులన్నింటినీ తక్షణం అటాచ్‌మెంట్‌ చేసి వడ్డీతో సహా బాధితులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పురేడ్ల శేషుకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉపప్రధాన కార్యదర్శి బి.వి.చంద్రశేఖర్‌ తదితరులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ వంటి సంస్థలు అమాయక ప్రజలను మోసం చేయకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మనీ డిపాజిట్ల కట్టడి చట్టాన్ని రాష్ట్రంలో పటిష్ఠంగా అమలు చేయాలని కోరారు. సమావేశంలో బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు, జేఎన్టీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆలపాటి శ్రీనివాస్‌, అసోసియేషన్‌ నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని