logo
Published : 29/11/2021 02:02 IST

సహకరిస్తే..సాగుతారండి !

ఎత్తిపోతలు కష్టమే...

ఐఏబీ సమావేశం నేడు


అమలాపురం: వేమవరం వద్ద గుర్రపుడెక్కతో అధ్వానంగా పంట కాలువ

న్యూస్‌టుడే, పి.గన్నవరం, సీతానగరం, రాజమహేంద్రవరం నగరం : ఖరీఫ్‌లో ప్రకృతి విపత్తుల ధాటికి పీకల్లోతు కష్టాల్లో మునిగిన రైతులు రబీపై ఆశలుపెట్టుకున్నారు. రబీ ముంగిట నిలిచినా.. ఇంకా చేలో వాన నీరు బయటకు వెళ్లలేదు. మరోవైపు నీటి లభ్యత తక్కువనే సమాచారం వారిని కలవర పెడుతోంది. ప్రణాళిక.. కార్యాచరణ.. పర్యవేక్షణతో.. శివారు ప్రాంతాలకూ సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదే. ముఖ్యంగా ప్రధాన పంట కాలువలు మొదలు పిల్లకాలువల వరకు శుభ్రంగా ఉండాలి. కానీ... తూడు, గుర్రపుడెక్క, ఇతర మొక్కలు మొలిచి మూసుకుపోయాయి. తద్వారా సాగునీటి ప్రవాహం కష్టమే. తక్షణమే వీటన్నింటిని చక్కదిద్దితే మంచిది. కలెక్టర్‌ హరికిరణ్‌ అధ్యక్షతన నేడు జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఎబీ) సమావేశంలో అన్నివిధాలా ఉపయుక్త నిర్ణయాలను రైతాంగం ఆశిస్తోంది.

రబీకి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి సరఫరా ఆపేయనున్నారు. సీలేరు ప్రాజెక్టు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్‌ పరిధిలోని 30 వేల ఎకరాల ఆయకట్టుకు ఏలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరా చేసేలా ప్రణాళిక ఉంది. ● పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధానకాలువ పరిధిలో ముసురుమిల్లి, భూపతిపాలెం, సూరంపాలెం ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రబీకి నీరివ్వరు. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతలు, వెంకటనగరం, పురుషోత్తపట్నం, తొర్రిగెడ్డ, చాగల్నాడు పథకాల నుంచి సాగునీరు సరఫరా ఉండదు. ● మధ్యతరహా ప్రాజెక్టులు పంపా, మద్దిగెడ్డ, సుబ్బారెడ్డి సాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి లభ్యత మేరకు ఆరుతడి పంటలకు అనుమతిస్తారు.

ఇలా చేయాలండి..

ప్రతి పంట కాలువ శుభ్రంచేయాలి. ● వరి ఆయకట్టు మినహా లంకభూములు, కొబ్బరితోటలు, ఆక్వాచెరువులకు నీరెళ్లకుండా చూడాలి. ● మురుగు కాలువలకు అడ్డుకట్టలు.. జనవరి 15కి పూర్తిచేయాలి. తద్వారా మురుగు గోదావరిలోకి వెళ్లదు. కీలకదశలో వీటి నుంచి నీటిని ఆయిల్‌ఇంజిన్లతో వరి చేలకు మళ్లించవచ్ఛు ● జిల్లాలో 40 వేల ఎకరాల శివారు ఆయకట్టుకు నీటి కొరత రాకుండా ఎప్పటికప్పుడు క్షేత్ర పరిశీలన చేయాలి. ● కాలువల ఆరంభంలో అనవసర వాడకం నియంత్రించాలి. ● చిన్నపాటి గండ్లనూ పూడ్చాలి. ● వంతుల వారీ విధానం కచ్చితంగా అమలుకావాలి. ● కాలువల వారీ రైతులతో కమిటీ వేసి.. జలవనరులు, రెవెన్యూ, పంచాయతీ, పోలీసులను సభ్యులుగా చేర్చాలి.

తప్పని ఎద్దడి..

తూర్పు డెల్టా ముఖద్వారం

రబీలో నిత్యం 10 వేల క్యూసెక్కుల నీరివ్వాలి. డిసెంబరు మొదటి వారం నుంచి నీటి విడుదల మొదలైతే ప్రస్తుతం ఉన్న నీరు జనవరి రెండో వారం వరకే సరిపోతుంది. మార్చి ఆఖరు వరకు సీలేరు ప్రాజెక్టు నుంచి రోజుకు కనీసం 4-5 వేల క్యూసెక్కులు అవసరం. ఆ సీజన్‌లో వర్షాలు తక్కువగా కురవడంతో ఇంత నీరందక పోవచ్ఛు అదేజరిగితే ఒడిశాలోని బలిమెల ప్రాజెక్టులో రాష్ట్ర వాటాను ముందుగానే అడిగే వీలుంది.

తెలిసి మసలుకోవాలి

రబీ అవసరాలకు అనుగుణంగా పంట కాలువలు బాగు చేయిస్తాం. వీటి నిర్వహణ పనులకు గుత్తేదారులు ఉన్నారు.తూడు, గుర్రపుడెక్క, ఇతర మొక్కలు తొలగిస్తారు. సమర్థ నీటి యాజమాన్య పద్ధతులు, వంతుల వారీ విధానం అమలుకు రైతులు సహకరించాలి. ఆరుతడి పంటలు వేసి.. పొదుపుగా వాడుకోవాలి. - బి.రాంబాబు, ఎస్‌ఈ, జలవనరులశాఖ, ధవళేశ్వరం

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని