logo
Published : 29/11/2021 02:02 IST

కార్యాలయాలకు అనువైన స్థలాల ఎంపిక


బొమ్మూరులో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

ధవళేశ్వరం: రైతుభరోసా కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, మెడికల్‌ హబ్‌, వెల్‌నెస్‌ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బొమ్మూరు, ధవళేశ్వరంలో ఆదివారం ఆయన పర్యటించారు. బొమ్మూరు డంపింగ్‌ యార్డుకు కేటాయించిన భూములను రీసర్వేచేసి స్పష్టమైన మ్యాపులను రూపొందించి నివేదించాలని తహసీల్దారు రియాజ్‌ హుస్సేన్‌ను ఆదేశించారు. ధవళేశ్వరం న్యాక్‌ సమీపంలో మెడికల్‌ హబ్‌ కోసం కేటాయించిన అయిదెకరాలు, బొమ్మూరులో టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. ధవళేశ్వరం జలవనరుల శాఖ, పీడబ్ల్యూడీ, ఉద్యోగుల నివాసాల కోసం ప్రతిపాదించిన భూములను పూర్తిగా సర్వేచేసి వివరాలు సమర్పించాలన్నారు. కాతేరులో మత్స్యశాఖ ద్వారా సేకరించిన ఆరెకరాలు పరిశీలించారు. కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఆర్‌ఐ సాగర్‌, సర్వేయర్‌ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని