logo
Published : 29/11/2021 02:02 IST

అమలాపురం కుర్రోడుమోడలింగ్‌లో మెరిశాడు


నిర్వాహకుల నుంచి పురస్కారం అందుకుంటున్న నాగేంద్ర

గడియార స్తంభం, న్యూస్‌టుడే: గ్రామీణ వాతావరణంలో పుట్టి స్థానిక కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుకున్న అమలాపురానికి చెందిన మేడిద నాగేంద్ర మోడలింగ్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించాడు. ప్రముఖుల ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. 2020లో గోవాలో నిర్వహించిన మిస్టర్‌ ఇండియా పోటీల్లో ఏపీ తరఫున అత్యధిక ఓట్లు సాధించాడు. ఈ ఏడాది నిర్వహించిన మిస్టర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని సౌత్‌ ఇండియా టాప్‌ మోడల్‌గా నిలిచినందుకు ప్రముఖ బిజినెస్‌ మింట్‌ సంస్థ.. ఇన్‌స్పైరింగ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ అఫ్‌ ది ఇయర్‌ - 2021 పురస్కారంతో సత్కరించినట్లు నాగేంద్ర ఫోన్‌లో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

అందరికంటే భిన్నంగా ఉండాలని..

చిన్ననాటి నుంచి భిన్నంగా ఉండాలన్నదే నా అభిమతం. అమలాపురం నుంచి ఇంత వరకు ఎవరూ మోడలింగ్‌ రంగం వైపు వెళ్లలేదు. నేనెందుకు ఆ దిశగా అడుగులు వేయకూడదని నిర్ణయించుకున్నా. నాన్న రమేష్‌బాబు, అమ్మ రాధాకృష్ణవేణికి మనసులో మాట చెప్పినపుడు అంగీకరించలేదు. వారిని ఒప్పించి.. ముంబయి, హైదరాబాద్‌లలో కొంతకాలం శిక్షణ పొందా. ప్రస్తుతం ఒక సినిమాలో హీరో, మరో చిత్రంలో విలన్‌ పాత్రలో నటిస్తున్నా. మరో సినిమాలో నటనకు ఒప్పందం చేసుకున్నా. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం తదిరత ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. తనకు మెగాస్టార్‌ చిరంజీవి, తమిళ నటుడు విజయ్‌సేతుపతి అంటే ఇష్టం. భవిష్యత్తులో విభిన్న పాత్రల్లో నటించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నా. ఏ రంగంలోనైనా ఎత్తుపల్లాలు సహజంగా ఉంటాయి.. వాటిని అధిగమించినపుడే లక్ష్యాన్ని చేరుకోవచ్ఛు. అని నాగేంద్ర పేర్కొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని