logo
Published : 29/11/2021 02:02 IST

‘పార్లమెంటరీ సంప్రదాయాల విస్మరణ సరికాదు’


కొవ్వొత్తుల ర్యాలీలో పళ్లంరాజు తదితరులు

కాకినాడ కలెక్టరేట్‌, సర్పవరం జంక్షన్‌: మోదీ ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థ సంప్రదాయాలను విస్మరించి బిల్లులు ప్రవేశపెట్టడం శ్రేయస్కరం కాదని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు పేర్కొన్నారు. కాకినాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2016లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కోసమే పెద్ద నోట్ల రద్దు చేశారని, ఇప్పుడు పలు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులతో రైతులను ఆదుకోవాలన్నారు. ఏడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విషయంలో 45 ఏళ్లు వెనక్కి వెళ్లామన్నారు. రాష్ట్రంలో విపత్తుల బాధితులను ఆదుకోవాలన్నారు. పోలవరం విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలన్నారు. సర్పవరం జంక్షన్‌లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆదివారం చేపట్టిన జనజాగరణ అభియాన్‌ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయకులు వెంకటేశ్వరరావు, పాండురంగారావు, శ్రీరామచంద్రమూర్తి, సుబ్బారాయుడు, ప్రసాదవర్మ, గాంధీరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని