logo
Published : 29/11/2021 02:16 IST

మరో మూడు రోజులు గాలులు

కాకినాడ కలెక్టరేట్‌: వర్షాలు తగ్గాయి. ఎండలు కాస్తున్నాయి. మిగిలిన పంటను ఒబ్బిడి చేస్తున్న అన్నదాతకు రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులు పులిమీద పుట్రలా తయారయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆదివారం మబ్బులు కమ్మేశాయి. చలిగాలుల తీవ్రత పెరగ్గా, కొన్నిచోట్ల చిరుజల్లులు కురిశాయి. మరో మూడు రోజులు ఇంతేననిరాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కలెక్టరేట్‌కు వర్తమానం పంపింది. దక్షిణ కోస్తాకు మాత్రమే వాన ప్రభావం ఉంటుందనీ, జిల్లాలో ఉండదని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 29, 30, డిసెంబరు 1 వరకు తీరం వెంట 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని సూచించింది. కిర్లంపూడి, ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, పెద్దాపురం, యు.కొత్తపల్లిలోకోతలు ప్రారంభమయ్యాయి.

Read latest East-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని