logo
Published : 29/11/2021 02:16 IST

మృతికి కారణం తేల్చాలి..

సఖినేటిపల్లి: తన కూతురిది ఆత్మహత్యా, హత్యా అనేది తేల్చాలని రాజోలు కోర్టులో ఓ మహిళ ప్రైవేటు కేసు వేయడంతో కోర్టు ఆదేశాలతో సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపాలకృష్ణ ఆదివారం తెలిపారు. వివరాల ప్రకారం.. గొంది గ్రామానికి చెందిన జాదవ శాంతరత్నంకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరితోపాటు మరో అమ్మాయిని పెంచుకుంది. వీరందరూ కొన్నాళ్లు ఇక్కడ.. మరికొన్నాళ్లు ముంబయిలో ఉంటున్నారు. పెంచుకున్న కూతురు జాదవ లక్ష్మి(28)కి కొల్లాబత్తుల ప్రవీణ్‌తో 2015లో పెళ్లి చేశారు. వీరికి ఆరేళ్ల పాపఉంది. ఉపాధికోసం లక్ష్మి 2019లో దుబాయ్‌ వెళ్లి 2020 డిసెంబరులో తిరిగొచ్చింది. ఆమె దుబాయ్‌లో ఉన్నప్పుడు ప్రవీణ్‌ వేరే మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. దాంతో భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 23 మార్చి 2021న లక్ష్మి చనిపోయింది. అందుకు కారణం తెలపాలని శాంతరత్నం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని దహనం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరడంతో ప్రవీణ్‌తోపాటు మరో 19మందిపై కేసు నమోదు చేశారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని