logo
Published : 29/11/2021 02:16 IST

పీవో చొరవతో వైద్యశాలకు బాలింత

పోచవరం రేవులో ప్రథమ చికిత్స చేస్తున్న 108 సిబ్బంది

పురిటినొప్పులతో అల్లాడిపోతున్న నిండు గర్భిణికి చరవాణి కొండత అండగా నిలిచిన ఘటన ఇది. వి.ఆర్‌.పురం మండలంలోని మారుమూల పాపికొండల పరీవాహక ప్రాంతంలోని గొందూరుకు చెందిన సాందల జయసుధకు ఆదివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు ఎక్కువకావడంతో భయపడిన కుటుంబసభ్యులు చింతూరు ఐటీడీఏ పీవోకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. ఆయన వారికి ధైర్యం చెప్పి, పడవ తీసుకుని వెంటనే పోచవరం రేవుకు రమ్మన్నారు. వారు వచ్చే సమయానికి 108 సిబ్బంది అక్కడుండేలా ఏర్పాటు చేశారు. పోచవరం తీసుకువచ్చేలోపే జయసుధకు కాన్పు అయ్యి మగశిశువుకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది, తల్లీబిడ్డకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి, కోతులగుట్ట ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేశారు. - న్యూస్‌టుడే, వరరామచంద్రాపురం

Read latest East-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని