logo
Published : 30/11/2021 06:29 IST

వేలిముద్రలేపట్టించాయి


రాజానగరం సీఐ సుభాష్‌కు ప్రశంసాపత్రం అందిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

రాజమహేంద్రవరం నేరవార్తలు: వేలిముద్రల ఆధారంగా ఇటీవల జరిగిన రెండు హత్య కేసులను రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను సోమవారం అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. రాజానగరం మండలం వెలుగుబందకు చెందిన మిని వ్యాన్‌ డ్రైవరు ఒ.నాగేంద్ర(32) ఈ నెల 26న తెల్లవారుజామున గాయాలతో దివాన్‌చెరువు జాతీయ రహదారిపై పడి ఉన్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజానగరం సీఐ సుభాష్‌కు ఘటనా స్థలంలో లభ్యమైన వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు. నాగేంద్ర ఆ రోజు ఉదయం తాడేపల్లిగూడెం నుంచి పిఠాపురానికి కమలా పండ్లు లోడుతో వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం శంభునగర్‌ ప్రాంతానికి చెందిన ఎం.వెంకటసాయి, వేమగిరి ప్రాంతానికి చెందిన టి.ముత్యాలు, మరో బాలుడు కలిసి వ్యానును ఆపి అతడి వద్ద ఉన్న నగదు, సెల్‌ ఫోను లాక్కునే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. నిందితుల్లో ఒకరు కత్తితో నాగేంద్రను రెండుసార్లు పొడిచి గుండెపై పిడి గుద్దులతో దాడి చేసి పరారయ్యారు. నిందితులు పాత నేరస్థులు కావడంతో వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

వృద్ధురాలి హత్య కేసు..

సీతానగరం మండలం వంగలపూడికి చెందిన కె.నాగమ్మ(72) 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును 48 గంటల్లో ఛేదించినట్లు అర్బన్‌ ఎస్పీ తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఇ.నవీన్‌, మరో బాలుడు ఈ నెల 24న స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో మద్యం తాగారు. ఇంటికి వెళ్తున్న సమయంలో నాగమ్మ కంట పడడం, ఆమె వీరిని దూషించడంతో ఆవేశంతో ఊగిపోయారు. ఇనుప రాడ్డు, ఇత్తడి చెంబుతో ఆమె తలపై మోదడంతో మృతి చెందింది. దర్యాప్తు చేసిన సీఐ పవన్‌ కుమార్‌ రెడ్డి, ఎస్సై కె.శుభశేఖర్‌ వేలిముద్రల ఆధారంగా బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సీఐలు, ఎస్సైలతో పాటు క్లూస్‌ టీం ఎస్సై ప్రవీణ్‌, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని