logo
Published : 30/11/2021 06:29 IST

మహిళా మావోయిస్టు లొంగుబాటు


నగదు, దుస్తులు అందజేస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

మసీదుసెంటర్‌ (కాకినాడ): ఓ మావోయిస్టు పార్టీ సభ్యురాలు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఎదుట సోమవారం లొంగిపోయారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. చింతూరు మండలం అల్లివాగులోని గుత్తికోయ తెగకు చెందిన కలుమా నందే అలియాస్‌ సుశీల సీపీఐ మావోయిస్టు పార్టీ ఆజాద్‌ రక్షణ బృందంలో చర్ల ఎల్‌ఓఎస్‌లో దళ సభ్యురాలిగా పని చేశారు. ఆమె 2019 డిసెంబరులో దళంలో చేరారు. మూడు రోజుల శిక్షణ అనంతరం ఆరు నెలలు పాటు దళ సభ్యురాలిగా పని చేశారు. ఆమె 12-బోర్‌ ఎస్‌బీబీఎల్‌ (సింగిల్‌ బ్యారెల్‌ బ్రీచ్‌ లోడింగ్‌) గన్‌ను ఉపయోగించే వారు. అక్కడ ఆమె వివక్ష ఎదుర్కొన్నారని, అగ్రనేతల దస్తులు ఉతకడం తదితర పనులు చేయించడంపై విరక్తి చెందారు. తన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యాకలాపాల గురించి తెలుసుకుని, సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయారని ఎస్పీ వివరించారు. అనంతరం ఆమెకు నగదు, దుస్తులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్‌, సీఐ యువకుమార్‌ ఎస్సై యాదగిరి బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఏఎస్పీ కరణం కుమార్‌, ఎస్బీ డీఎస్పీ అంబికాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని